దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న మరణాలు
Corona cases | దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా రెండో రోజూ రెండు లక్షలోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం లక్షా 67 వేల కేసులు రికార్డవగా, తాజాగా మరో లక్షా 60 వేల మంది కరోనా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా రెండో రోజూ రెండు లక్షలోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం లక్షా 67 వేల కేసులు రికార్డవగా, తాజాగా మరో లక్షా 60 వేల మంది కరోనా బారినపడ్డారు. ఇది నిన్నటికంటే ౩ శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే కరోనా మరణాలు మాత్రం రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
దేశంలో కొత్తగా 1,61,386 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,16,30,885కు చేరాయి. ఇందులో 3,95,11,307 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 16,21,603 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మహమ్మారి వల్ల ఇప్పటివరకు 4,97,975 మంది మృతిచెందారు.
కాగా, గత 24 గంటల్లో 2,81,109 కోలుకోగా, 1733 మంది మరణించారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా కేసులు తగ్గుతుండటంతో రోజువారీ పాజిటివీ రేటు 9.26 శాతానికి తగ్గిందని తెలిపింది. అదేవిధంగా ఇప్పటివరకు 167.29 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

