న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు (Corona cases) స్వల్పంగా తగ్గాయి. గురువారం 13,091 కేసులు నమోదవగా తాజాగా అవి 12 వేల దిగువకు చేరాయి. ఇది నిన్నటికంటే 4.3 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కొత్తగా 12,516 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,14,186కు చేరాయి. ఇందులో 3,38,14,080 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,37,416 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. మరో 4,62,690 మంది మహమ్మారికి బలయ్యారు. కాగా, గత 24 గంటల్లో 501 మంది మరణించగా, 13,155 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. మృతుల్లో ఎక్కువగా కేరళలోనే ఉన్నారని వెల్లడించింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 419 మంది మరణించారు.