న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 2124 కేసులు నమోదవగా, కొత్తగా మరో 2628 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇది నిన్నటికంటే 24 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,44,820కు చేరాయి. ఇందులో 4,26,04,881 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. మరో 5,24,525 మంది మరణించగా, 15,414 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 18 మంది మృతిచెందగా, 2167 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో 0.03 కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.75, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నదని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా 1,92,82,03,555 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఇందులో బుధవారం ఒకేరోజు 13,13,687 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని పేర్కొన్నది.