న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా ఆరువేల లోపే రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా5,476 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,62,953కు చేరింది. ఇందులో 4,23,88,475 మంది కోలుకున్నారు. మరో 5,15,036 మంది మరణించగా, 59,442 మంది బాధితులు ఇంకా చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 158 మంది కరోనాకు బలవగా, 9754 మంది కోలుకున్నారు.
కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.14 శాతం మాత్రమేనని, 98.66 శాతం మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివకు 1,78,83,79,249 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.