న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కువైట్ అత్యున్నత గౌరవ పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ను అందుకున్నారు. విదేశాల అత్యున్నత నాయకులకు, రాజ కుటుంబాల సభ్యులకు స్నేహానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని అందిస్తారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం కువైట్ చేరుకున్న మోదీకి బేయన్ ప్యాలెస్లో సైనిక వందనం లభించింది. కువైట్ అమీర్(దేశాధినేత) షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జబర్ అల్-సబహ్ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 43 ఏండ్లలో భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే ప్రథమం.