న్యూఢిల్లీ: ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రతి ఏడాది 10.2 మిలియన్ టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నది. ఇది తరువాతి పెద్ద కాలుష్య దేశాల కంటే రెండింతలు ఎక్కువని ఒక నివేదిక వెల్లడించింది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌కు చెందిన పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ వ్యర్థాలు ఒక చోటని కాక సముద్ర గర్భం నుంచి కొండ శిఖరాల వరకు, ఆఖరికి మానవ శరీరంలో సైతం పెద్దయెత్తున పేరుకుపోతున్నాయి. ఈ వ్యర్థాల్లో మూడింట రెండు వంతులు ప్రపంచంలోని దక్షిణ దేశాల నుంచే వస్తున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: మొబైల్ ఫోన్ వాడకానికి, బ్రెయిన్ క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధమూ లేదని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్‌వో) తాజా అధ్యయనం వెల్లడించింది. 1994 నుంచి 2022 వరకు వెలువడిన 63 అధ్యయనాల్ని విశ్లేషించిన పరిశోధకుల బృందం పై విషయాన్ని తేల్చింది. మొబైల్ ఫోన్ నుంచి వెలువడే రేడియో తరంగాలకు, బ్రెయిన్ క్యాన్సర్‌కు సంబంధం లేదని నిర్ధారించారు. గత రెండు దశాబ్దాల్లో వైర్లెస్ టెక్నాలజీ బాగా వినియోగంలోకి వచ్చిన తర్వాత, బ్రెయిన్ క్యాన్సర్ కేసుల్లో పెరుగుదల లేదని పరిశోధనకు నేతృత్వం వహించిన ‘ఆస్ట్రేలియన్ రేడియోషన్ ప్రొటెక్షన్, న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ’ తెలిపింది.