NITI Aayog | న్యూఢిల్లీ : జపాన్ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. మనదిప్పుడు 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు. అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే మనకంటే ముందున్నట్టు పేర్కొన్నారు.
మరో రెండున్నర, మూడేండ్లలో మూడో స్థానానికి చేరుకోవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. రెండో విడత ఆస్తుల నగదీకరణ కార్యక్రమం ఉంటుందని, దీనిని ఆగస్టులో ప్రకటిస్తామని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.