Cybercrime: ఇండియాలో పెరుగుతున్న సైబర్ నేరాలు : కాస్పర్స్కీ రిపోర్ట్
Cybercrime: ఇండియాలో సైబర్ క్రైం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆ దాడులు జరుగుతున్న దేశాల్లో ఇండియా 80వ స్థానంలో ఉంది. 2023లో 34 శాతం మంది కంప్యూటర్ యూజర్లకు స్థానిక బెదిరింపులు వచ్చాయి. ఏడున్నర కోట్ల మందిపై జరిగిన సైబర్ అటాక్‌ను ఆపినట్లు కాస్పర్స్కీ కంపెనీ వెల్లడించింది.
న్యూఢిల్లీ: సైబర్ నేరాల(Cybercrime)పై తాజా రిపోర్టు రిలీజైంది. దాంట్లో ఇండియా 80వ స్థానంలో ఉన్నది. 2023 సంవత్సరంలో దేశంలోని సుమారు 34 శాతం మంది యూజర్లను స్థానికంగా టార్గెట్ చేసినట్లు ఆ రిపోర్టు ద్వారా తేలింది. యూజర్ల కంప్యూటర్లలోకి నేరుగా వస్తున్న స్పామ్ మెసేజ్‌లు లేదా ఫ్లాష్ డ్రైవ్స్, కెమెరా మెమోరీ కార్డులు, ఫోన్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్‌ల్లో ఆ మెసేజ్‌లను గుర్తించిన ఆధారంగా డేటాను రూపొందించారు. దేశంలో సుమారు 74,385,324 స్థానిక సైబర్ దాడుల్ని కాస్పర్స్కీ నిలువరించినట్లు తెలుస్తోంది.
కాస్పర్స్కీకి చెందిన వేర్వేరు యాంటీ వైరస్ ఉత్పత్తులు .. సైబర్ దాడుల్ని గుర్తించి, ఆపేసినట్లు రిపోర్టులో తెలిపారు. ఇండియాలో గత ఏడాది సుమారు 6 బిలియన్ల డాలర్ల సైబర్‌సెక్యూర్టీ మార్కెట్ జరిగింది. గ్లోబల్ సైబర్ సెక్యూర్టీ, డిజిటల్ ప్రైవసీ కంపెనీ కాస్పర్స్కీ .. సైబర్ దాడులకు చెందిన మరికొన్ని విషయాలను వెల్లడించింది. భారతీయ యూజర్లలో 34 శాతం మందికి స్థానిక సైబర్ దాడులు జరిగినట్లు ఆ కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం కంప్యూటర్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ దాడులు కూడా పెరిగినట్లు ఆ కంపెనీ వెల్లడించింది. ఇదే సమయంలో ఆయ కంపెనీలు సైబర్ సెక్యూర్టీని ప్రాధానత్య ఇస్తున్నట్లు తెలిపింది. ఇండియాలోని దాదాపు 67 శాతం కంపెనీలు సెక్యూర్టీని ఔట్సోర్సింగ్ చేస్తున్నట్లు ఆ కంపెనీ రిపోర్టలో తేలింది. డిజిటల్ కనెక్టివిటీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల.. ఇండియాలో సైబర్ బెదిరింపులు కూడా ఎక్కువైనట్లు చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

