న్యూఢిల్లీ, ఆగస్టు 14: పాక్ కనుక భారత్‌పై ఎలాంటి దుస్సాహసానికైనా ఒడిగడితే బాధాకరమైన పరిణామాలను ఎదుర్కోక తప్పదని భారత్ హెచ్చరించింది. ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇటీవల భారత్‌ను బెదిరిస్తూ చేసిన అణు వ్యాఖ్యలపై భారత్ ఈ మేరకు బదులిచ్చింది. ఇటీవలి ఆపరేషన్ సిందూర్ పరిణామాల్లో తోక ముడిచిన పాక్ వైఖరిని గుర్తు చేసింది.
‘భారత్‌కు వ్యతిరేకంగా ఆ దేశ నేతలు చూపుతున్న నిర్లక్ష్యం, యుద్ధోన్మాదం, ద్వేషపూరిత వ్యాఖ్యలను మేము నిత్యం గమనిస్తూనే ఉన్నాం. తమ వైఫల్యాలను కప్పి పుచ్చడానికి పదే పదే భారత వ్యతిరేక వాక్చాతుర్యాన్ని రెచ్చగొట్టడం ఆ దేశ పద్థతి’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. ‘ఎలాంటి దుస్సాహసాలకు దిగినా బాధాకరమైన పరిస్థితులు తప్పవన్న విషయాన్ని ఇటీవలే చేసి చూపి ంచాం’ అని ఆయన హెచ్చరించారు.