బుధవారం 21 అక్టోబర్ 2020
National - Sep 20, 2020 , 03:34:34

రికవరీల్లో అమెరికాను దాటిన భారత్‌

రికవరీల్లో అమెరికాను దాటిన భారత్‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. ఈ విషయంలో అమెరికాను భారత్‌ దాటేసి ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. శనివారం నాటి కి దేశంలో మొత్తం 42 లక్షల మందికి పైగా కోలుకున్నారు. అమె రికాలో ఈ సంఖ్య 41 లక్షలు. గత 24 గంటల్లో దేశంలో రికార్డుస్థాయిలో 95,880 మంది కోలుకున్నారు.


logo