న్యూఢిల్లీ: దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వేబోర్డు(ఆర్బీ) ఆమోదం తెలిపింది. ఈ నెలలో ఆర్డీఎస్ఓ, ఉత్తర రైల్వేలకు పంపిన లేఖలో 10 కోచ్ల హైడ్రోజన్ రైలును ప్రవేశపెట్టేందుకు బోర్టు అనుమతి తెలియజేసింది. ఢిల్లీ డివిజన్లోని జింద్- సోనిపట్ విభాగంలో ఈ రైలు గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని బోర్డు పేర్కొన్నది.
కాగా మార్చి నెలలో ట్రయల్ రన్ పూర్తయ్యింది. రిసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఈ పరీక్షను నిర్వహించింది. త్వరలోనే ఈ రైలు పట్టాలు ఎక్కనుంది.