అహ్మదాబాద్: సరిహద్దులో చైనా నుంచి అత్యంత కఠినమైన సవాళ్లు ఎదురవుతున్నాయని, వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. సరిహద్దు రేఖను మార్చేందుకు చైనా ఏకపక్షంగా చేస్తున్న యత్నాల్ని అడ్డుకున్నామని చెప్పారు. ‘చైనాతో మంచి సంబంధాల్నే కోరుకుంటున్నాం. ఇరు దేశాల సంబంధాల్లో సమతుల్యం సాధించాల్సిన అవసరముంది. దురదృష్టవశాత్తు భారత్ లేవనెత్తిన ఆందోళనలను చైనా పట్టించుకోవటం లేదు’ అని ఆయన అన్నారు.