భారత విదేశీ రుణం రూ 72 లక్షల కోట్లు
దీ సర్కార్ పాలనలో దేశం అప్పులకుప్పగా మారుతున్నది. కేంద్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తుండటంతో రుణభారం ఏటికేడు భారీగా పెరుగుతున్నది. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) సోమవారం విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం 2025 మార్చి చివరి నాటి స్థాయిలతో పోలిస్తే భారతదేశ విదేశీ రుణం 2,630 కోట్ల డాలర్లు పెరిగి ప్రస్తుతం రూ.72 లక్షల కోట్లకు చేరింది.
- జీడీపీలో విదేశీ రుణ నిష్పత్తి 20.8%
న్యూఢిల్లీ: మోదీ సర్కార్ పాలనలో దేశం అప్పులకుప్పగా మారుతున్నది. కేంద్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తుండటంతో రుణభారం ఏటికేడు భారీగా పెరుగుతున్నది. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) సోమవారం విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం 2025 మార్చి చివరి నాటి స్థాయిలతో పోలిస్తే భారతదేశ విదేశీ రుణం 2,630 కోట్ల డాలర్లు పెరిగి ప్రస్తుతం రూ.72 లక్షల కోట్లకు చేరింది. స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ)కి విదేశీ రుణాల నిష్పత్తి కూడా 2025 మార్చి చివరి నాటికి ఉన్న 19.8% నుండి 2026 మార్చి చివరి నాటికి 20.8%కి పెరిగింది.
భారతీయ రూపాయి, ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ విలువ పెరగడం వల్ల కలిగిన వాల్యూయేషన్ ప్రభావం(విలువ మార్పు ప్రభావం) 2,460 కోట్ల డాలర్లుగా ఉన్నప్పటికీ ఒకవేళ ఈ ప్రభావాన్ని మినహాయిస్తే 2025 మార్చి చివరి నాటితో పోలిస్తే 2026 మార్చి చివరి నాటికి విదేశీ రుణం 2,630 కోట్ల డాలర్లకు బదులుగా 5,100 కోట్ల డాలర్లు పెరిగి ఉండేది.
2026 మార్చి చివరి నాటికి భారతదేశ విదేశీ రుణంలో అమెరికా డాలర్లతో ఉన్న రుణమే 55.5% వాటాతో అతిపెద్ద భాగంగా కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో భారత రూపాయి (29.4%), ఎన్(6.4%), ఎస్డీఆర్2(4.3%), యూరో(3.7%)లలో ఉన్న రుణాలు ఉన్నాయి. దీర్ఘకాలిక రుణం(ఒక సంవత్సరం కంటే ఎక్కువ అసలు మెచ్యూరిటీతో) కూడా 2025 మార్చి చివరి నాటి స్థాయి కంటే 1,160 కోట్ల డాలర్లు పెరిగి 61,350 కోట్ల డాలర్లకు చేరింది. మొత్తం బాహ్య రుణంలో స్వల్పకాలిక రుణాల(ఒక సంవత్సరం వరకు అసలు మెచ్యూరిటీ ఉన్నవి) వాటా కూడా 2025 మార్చి చివరి నాటికి 18.3% నుండి 2026 మార్చి చివరి నాటికి 19.6% పెరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- external debt
- gdp
- India
- rbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

