న్యూఢిల్లీ: పాకిస్థాన్ హై కమిషన్ అధికారిని భారత ప్రభుత్వం బుధవారం బహిష్కరించింది. ఆయన తన అధికారిక హోదాకు తగినవి కానటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. 24 గంటల్లోగా దేశం నుంచి వెళ్లిపోవాలని ఆయనను ఆదేశించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
పాకిస్థానీ దౌత్యవేత్తలు, అధికారులు తమ అధికారాలు, హోదాను దుర్వినియోగపరచకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది.