న్యూఢిల్లీ: డీఆర్డీవో అభివృద్ధి చేసిన ‘రుద్రం-2’ క్షిపణి పరీక్షలు సక్సెస్ అయ్యాయి. చాందీపూర్ టెస్ట్ రేంజ్లో అత్యంత క్లిష్టమైన, కీలకమైన పథంలో క్షిపణి పరీక్షలు జరిపినట్టు రక్షణ శాఖ మంగళవారం తెలిపింది. ఈ క్షిపణి వైమానిక దళంలో ఒక గేమ్‌చేంజర్‌గా భావిస్తున్నారు. కొన్నేండ్లుగా వాడుతున్న రష్యా ‘కేహెచ్-31’ మిస్సైల్స్ పాతబడగా, వీటి స్థానాన్ని భర్తీ చేసేందుకు ‘రుద్రం-2’ను ప్రవేశపెడుతున్నారు.
‘రుద్రం-2’ శబ్దవేగం కంటే 5.5 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లగలదు. 300 కిలోమీటర్ల పరిధిలో శత్రు దేశాల రాడార్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నోడ్స్, క్షిపణి వ్యవస్థను నాశనం చేయగలదు.