Pakistan | న్యూఢిల్లీ: పంజాబ్‌లోని జలంధర్ వద్ద నిఘా డ్రోన్‌ను కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు చోట్లు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. శకలాల దగ్గరికి ప్రజలు వెళ్లొద్దని సూచించారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరారు. బాణసంచా పేల్చొదని సూచించారు. భయందోళలు సృష్టించేందుకు ప్రయత్నించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మా యుద్ధ విమానం ధ్వంసమైంది నిజమే: పాక్
ఇస్లామాబాద్: భారత్ యుద్ధ విమానాలు జరిపిన దాడిలో తమ ఫైటర్ జెట్ విమానం ఒకటి దెబ్బతిన్నట్టు ఆ దేశ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే అది ఏ విమానం, ఎంత మేరకు నష్టం జరిగింది తదితర వివరాలు వెల్లడించ లేదు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పలు పాకిస్థానీ జెట్ విమానాలను విజయవంతంగా నేలకూల్చి తీవ్ర నష్టాన్ని కలిగించినట్టు భారత్ ప్రకటించిన క్రమంలో ఎట్టకేలకు పాకిస్థాన్ తమకు నష్టం జరిగిన విషయాన్ని అంగీకరించింది.