న్యూఢిల్లీ : పశ్చిమాసియలో నెలకొన్న యుద్ధ సంక్షోభం కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం కొట్టివేసింది. దేశంలో ఇంధన కొరత ముంచుకొస్తున్న తరుణంలో దేశంలో లాక్డౌన్ తరహా చర్యలు చేపడతారని వస్తున్న వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తిరస్కరించారు.
అలాంటి ప్రచారం అంతా ఆధార రహితమని, అలాంటి తరహా చర్యలేవీ కేంద్రం పరిశీలించడం లేదని కొట్టివేశారు. దేశంలో ఇంధన కొరత ఉందని, అందుకే లాక్డౌన్ను విధిస్తారని కొంతమంది నేతలు చేస్తున్న ప్రకటనలు తనను ఆశ్చర్యపరిచాయని అన్నారు.