న్యూఢిల్లీ: ఉగ్రవాది మసూద్ అజర్ బహిరంగ సభలో పాల్గొని, భారత్, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచ ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం భారత్, ఇజ్రాయెల్ దేశాల లక్ష్యంగా జీహాదీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తానని మసూద్ శపథం చేసినట్లు తెలుస్తున్నది. దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, పాకిస్థాన్ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని దుయ్యబట్టారు.
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాకిస్థాన్లో ఉన్న విషయాన్ని ఆ దేశం నిరంతరం నిరాకరిస్తూ వస్తున్నదన్నారు. పాకిస్థాన్లో జరిగిన సభలో మసూద్ మాట్లాడినట్లు వచ్చిన వార్తలు నిజమే అయితే, ఆ దేశపు నయవంచన తేటతెల్లమైనట్లేనని వ్యాఖ్యానించారు.