న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో డిసెంబర్ 9వ తేదీన చైనా ఆర్మీని భారత సైనికులు అడ్డుకున్న విషయం తెలిసిందే. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు వచ్చిన పీఎల్ఏ దళాల్ని మన సైనికులు తిప్పికొట్టారు. ఆ అంశం గురించి పార్లమెంట్లో కేంద్రం ప్రకటన కూడా చేసింది. అయితే తాజాగా వాట్సాప్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. బోర్డర్ వద్ద భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న చైనా ఆర్మీని భారత బలగాలు తిప్పికొట్టాయి. చేతుల్లో లాఠీలతో ఉన్న భారతీయ జవాన్లు.. చైనా దళాల్ని సమర్థవంతంగా అడ్డుకున్నారు.
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో.. డిసెంబర్ 9వ తేదీ నాటికి కాదని భారతీయ ఆర్మీ స్పష్టం చేసింది. లడాఖలోని గాల్వాన్లో రెండేళ్ల క్రితం జరిగిన ఘటన తర్వాత బహుశా ఈ అటాక్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కొత్తగా వైరల్ అవుతున్న వీడియోలో.. చైనా దళాలు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించాయి.
బోర్డర్ దాటాలనుకుంటున్న చైనా ఆర్మీని .. లాఠీలతో భారతీయ సైనికులు ధైర్యంగా అడ్డుకున్నారు. కానీ ఈ వీడియోకు చెందిన పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.