న్యూఢిల్లీ : ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టపరిచే చర్యలలో భాగంగా 2020 నుంచి నిలిపివేసిన కైలాశ్ మానస్ సరోవర్ యాత్రను 2025 వేసవి నుంచి పునరుద్ధరించాలని భారత్, చైనా నిర్ణయించాయి. అంతేగాక రెండు దేశాల మధ్య నేరుగా నడిచే విమానాలను మళ్లీ నడపాలని కూడా ఉభయ దేశాలు నిర్ణయించాయి. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య సోమవారం బీజింగ్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. నదీ జలాల పరిమాణానికి చెందిన వివరాల బదిలీ నిబంధన పునరుద్ధరణపై ఉభయ దేశాల నిపుణుల స్థాయి సమావేశాన్ని త్వరగా నిర్వహించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు.