న్యూఢిల్లీ : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తాజా పరిణామాల పట్ల భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలను పెంచే చర్యలను నివారించాలని ఇరు దేశాలను కోరింది. ఈ ప్రాంతంలోని భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, స్థానిక అధికారుల సలహాలను పాటించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇరాన్‌లోని అణ్వాయుధ, క్షిపణి, సైనిక కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ ప్రకటనను శుక్రవారం విడుదల చేసింది.