న్యూఢిల్లీ, ఆగస్టు 10: భారత నావికా దళం అరేబియా సముద్రంలో నావికా విన్యాసాలు నిర్వహించడానికి నిర్ణయించింది. అదే సమయంలో మన దాయాది పాకిస్థాన్ కూడా తమ ప్రాదేశిక జలాల్లో నౌకా విన్యాసాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నది.
ఇటీవలే రెండు దేశాల మధ్య చోటుచేసుకున్న పోరు నేపథ్యంలో ఈ విన్యాసాలు ఉద్రిక్తతలకు దారితీస్తాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెల 11, 12 తేదీల్లో తమ యుద్ధ నౌకలు అరేబియా సముద్ర జలాల్లో విన్యాసాలు నిర్వహిస్తాయని మన రక్షణ వర్గాలు ఆదివారం నిర్ధారించాయి. అయితే అదే సమయంలో తాము కూడా నావికా విన్యాసాలు చేపట్టనున్నట్టు పాకిస్తాన్ నోటమ్ జారీ చేసింది.