న్యూఢిల్లీ, ఆగస్టు 12: భారత్, చైనా మధ్య దాదాపు నాలుగేండ్లుగా నిలిచిపోయిన ప్రత్యక్ష విమాన సర్వీసులను పునరుద్ధరించే అవకాశం కనపడుతున్నది. సెప్టెంబర్ కల్లా చైనాకు ప్రత్యక్ష విమాన సర్వీసుల్ని ప్రారంభించాలంటూ ఎయిరిండియా, ఇండిగోలను భారత ప్రభుత్వం కోరినట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి.
ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటానికి ఇదొక సంకేతమని ‘రాయిటర్స్’ వార్తా కథనం పేర్కొన్నది. వీలైనంత తొందరగా చైనాకు ప్రత్యక్ష విమాన సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఎయిరిండియా, ఇండిగో సంస్థలను కేంద్రం కోరినట్టు తెలిసింది.