న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమి నాయకులు ఈ నెల 6న ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో సమావేశం కావాలని నిర్ణయించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. అయిదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాలుగు రాష్ర్టాల ఫలితాలు ఆదివారం వెల్లడి కావడంతో వాటి ఫలితాల ఆధారంగా ఇండియా కూటమి తన వ్యూహాలకు పదును పెట్టే అవకాశం కనిపిస్తున్నది. ప్రాంతీయ పార్టీల మధ్య సీట్ల సంపకంపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నది. సీట్ల పంపకాన్ని త్వరగా ఖరారు చేయాలని తృణమూల్ కాంగ్రెస్, ఆప్, సమాజ్వాదీ లాంటి పార్టీలు కోరినా అసెంబ్లీ ఎన్నికల వల్ల అది వాయిదా పడింది.