న్యూఢిల్లీ: తావీ నదిలో వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు పాకిస్థాన్‌కు ఇండియా వార్నింగ్(Flood Warning) ఇచ్చింది. ప్రస్తుతం పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇండో, పాక్ మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేతలో ఉన్న విషయం తెలిసిందే. తావీ నది పరివాహక ప్రాంతంలో వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు పాకిస్థాన్‌కు సమాచారం చేరవేసినట్లు ఓ కథనం ద్వారా తెలిసింది. అయితే ఈ పరిణామానికి చెందిన అధికారిక సమాచారం లేదు. సాధారణంగా వరదలకు చెందిన వార్నింగ్.. సింధూ జలాల కమీషనర్ చూసుకుంటారు. మే నెలలో రెండు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల తర్వాత తొలిసారి ఇండియా, పాక్ కాంటాక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లో ఉన్న భారతీయ హై కమీషన్‌కు అలర్ట్ అంశాన్ని చేరవేశారు. భారత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పాకిస్థాన్ అధికారులు స్థానికులకు వరద వార్నింగ్ ఇచ్చారు.