Independence Day 2025 | తొలి స్వాతంత్య్ర వేడుకల్లో గాంధీజీ ఎందుకు పాల్గొనలేదు?
Independence day అది 1947 ఆగస్టు 15.. ఎన్నో ఏండ్ల బానిస బతుకుల నుంచి విముక్తి లభించిన రోజు. ఆనాడు రాజధాని ఢిల్లీ సహా దేశమంతటా ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నారు. కానీ స్వరాజ్య స్థాపన కోసం తుదివరకు అహింసను ఆయుధంగా చేసుకుని పోరాడిన మహాత్మా గాంధీ మాత్రం ఢిల్లీలో లేరు. ఢిల్లీకి దూరంగా కలకత్తా వెళ్లారు.
Independence day అది 1947 ఆగస్టు 15.. ఎన్నో ఏండ్ల బానిస బతుకుల నుంచి విముక్తి లభించిన రోజు. ఆనాడు రాజధాని ఢిల్లీ సహా దేశమంతటా ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నారు. జవహార్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ సహా చాలామంది స్వతంత్య్ర సమరయోధులు, ప్రజలు ఢిల్లీ నగరానికి చేరుకుని సంబురాలు చేసుకుంటున్నారు. కానీ స్వరాజ్య స్థాపన కోసం తుదివరకు అహింసను ఆయుధంగా చేసుకుని పోరాడిన మహాత్మా గాంధీ మాత్రం ఢిల్లీలో లేరు. ఢిల్లీకి దూరంగా కలకత్తా వెళ్లారు. అక్కడ కూడా సంబురాల్లో పాల్గొనలేదు. రోజంతా ఉపవాసం చేస్తూ మౌనదీక్ష పూనారు.
ఎన్నో ఏండ్లుగా కలలు కన్న స్వరాజ్యం వచ్చిన రోజునే భారతదేశం రెండు ముక్కలైంది. మత ప్రాతిపాదికన భారత్, పాకిస్థాన్‌గా విడిపోయింది. ఆ సమయంలో హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే ఆనందం కంటే కూడా.. దేశం రెండుగా చీలిపోయిందనే బాధే గాంధీజీలో ఎక్కువగా ఉండిపోయింది. అదే సమయంలో బెంగాల్లో గొడవలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిసి బాపూజీ కలత చెందారు. వెంటనే కలకత్తా బయలుదేరి వెళ్లారు.
బెంగాల్లో శాంతి నెలకొంటే దేశవ్యాప్తంగా హిందూ, ముస్లింల మధ్య వివాదాలు సద్దుమణుగుతాయన్నది గాంధీజీ నమ్మకం. అందుకే 1947 ఆగస్టు 9న ఆయన కలకత్తాకు వెళ్లారు. బంగ్లాదేశ్‌లో ఉన్న నౌకాలి ప్రాంతంలో ఎక్కువగా మత ఘర్షణలు జరుగుతున్నాయని తెలిసి.. అక్కడికి కూడా వెళ్లాలని గాంధీ అనుకున్నారు. కానీ చాలామంది అడ్డుతగిలి ఆయన్ను బంగ్లాదేశ్‌లోకి వెళ్లనివ్వలేదు. దీంతో మియాబగన్ సమీపంలో ఉన్న హైదరీ మంజిల్‌లో బాపూజీ బస చేశారు. కానీ అప్పటికే గాంధీజీపై ముస్లింల నుంచి వ్యతిరేకత మొదలైంది. ముస్లిం వ్యతిరేకి గాంధీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ముస్లింలు ఆందోళనలు చేశారు. అయినా గాంధీ వెనక్కి తగ్గలేదు.
రోజురోజుకీ ఆందోళనలు ఎక్కువైపోతుండటంతో.. వాటిని ఆపేందుకు ఆగస్టు 13 ఘర్షణల్లో చురుగ్గా పాల్గొంటున్న వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాల వారితో భేటీ అయి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లెవరూ గాంధీ మాటలను వినేందుకు సుముఖంగా లేరు. కానీ గాంధీజీ మాత్రం తన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు. శాంతియుతంగా వారితో చర్చలు జరుపుతూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆగస్టు 15వ తేదీన గాంధీజీ 24 గంటల పాటు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు. మౌనంగా ఉంటూ చరఖా తిప్పుతూ గడిపేశారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే వివాదం మొత్తం సద్దుమణిగింది. మత ఘర్షణలు తగ్గుముఖం పట్టాయి. ఇదంతా గమనించిన లార్డ్ మౌంట్ బాటెన్.. పంజాబ్‌లో 55 వేల మంది సైనికులను పెట్టి కూడా ఆందోళనలను ఆపలేకపోయాం.. కానీ బెంగాల్లో మాత్రం ఒకే ఒక వ్యక్తి వీటిని నిలవరించాడని పేర్కొనడం విశేషం.
కలకత్తాలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించి సఫలీకృతుడైన గాంధీజీని అభినందించేందుకు సి. రాజగోపాలాచారి అక్కడికి వెళ్లారు. అయితే ప్రజలు ఒక్కటిగా లేనప్పుడు ఈ స్వాతంత్య్రం తనకు ఆనందం ఇవ్వలేదని ఆ సందర్భంగా రాజగోపాలాచారితో గాంధీ చెప్పాడు. హిందూ, ముస్లింలు మళ్లీ కలిసి ఉంటే తప్ప నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు కాదని ఆయన పేర్కొన్నాడు. కలకత్తా తర్వాత భారత్, పాకిస్థాన్‌లోని హిందూ, ముస్లింల మధ్య శాంతిని నెలకొల్పాలని గాంధీ ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో ఉండగానే గాంధీని గాడ్సే హత్య చేశాడు.
Read More :
Independence Day | మహాత్మాగాంధీ అరుదైన చిత్రాలు.. గ్యాలరీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TN CM Vijay | తమిళనాడు ఎమ్మెల్యేల తీరుతో ప్రభుత్వంపై విమర్శలు.. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సీఎం విజయ్
కోదాడ కిట్స్‌లో ప్రాంగణ ఎంపికలు.. 12 మంది ఎంపిక
‘విద్యార్థుల్లోని ప్రతిభ వెలికితీతకు చెకుముకి సైన్స్ సంబురాల నిర్వహణ’
NHM Employees | 30వ రోజు ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె.. చిన్నారులకు అందని టీకాలు
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : గుత్తా మంజుల
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

