TN CM Vijay | తమిళనాడు ఎమ్మెల్యేల తీరుతో ప్రభుత్వంపై విమర్శలు.. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సీఎం విజయ్
TN CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన టీవీకే (TVK) పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం (Emergency Meet) ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల తీరుతో విజయ్ సర్కారు (Vijay Govt) పై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఆయన దిద్దుబాటు చర్యలకు దిగారు.
TN CM Vijay : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన టీవీకే (TVK) పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం (Emergency Meet) ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల తీరుతో విజయ్ సర్కారు (Vijay Govt) పై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఆయన దిద్దుబాటు చర్యలకు దిగారు. పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, ప్రజలపై దాడులకు పాల్పడినట్లు వస్తున్న వార్తలు టీవీకే (TVK) ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి.
ఎమ్మెల్యేల తీరుపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి విమర్శలు వస్తుండడంతో వారికి దిశానిర్దేశం చేయడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. పార్టీ ప్రతినిధులు, ఎమ్మెల్యేలు క్రమశిక్షణతో వ్యవహరించాలని, తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజల సమస్యలకు స్పందించాలని విజయ్ తన ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న దోపిడీలు, హత్యల గురించి డీఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
విజయ్ ప్రభుత్వ తీరుతో తమిళనాడులో శాంతిభద్రతలు ఐసీయూలో ఉన్నాయని, పరిపాలన కోమాలోకి వెళ్లిపోయిందని స్టాలిన్ విమర్శించారు. ఒకే రోజు 17 హత్యలు జరిగాయని, ఒక టీవీకే ఎమ్మెల్యే మహిళా జిల్లా కలెక్టర్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపారనే ఆరోపణలు ఉన్నాయని స్టాలిన్ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో నేరస్థులకు భయం లేదని, పోలీసులకు కూడా రక్షణ లేదని మండిపడ్డారు. టీవీకే ప్రజాప్రతినిధులపై ఎటువంటి నియంత్రణ లేదని, మొత్తానికి ఈ ‘పార్ట్-టైమ్’ ముఖ్యమంత్రికి రాష్ట్రంపై ఎటువంటి బాధ్యత లేదని దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ విమర్శలు గుప్పించారు. టీవీకేకు చెందిన వారే పాఠశాల విద్యార్థినులను లైంగికంగా వేధించడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ పార్టీ నాయకత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TN CM Vijay | తమిళనాడు ఎమ్మెల్యేల తీరుతో ప్రభుత్వంపై విమర్శలు.. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సీఎం విజయ్
కోదాడ కిట్స్‌లో ప్రాంగణ ఎంపికలు.. 12 మంది ఎంపిక
‘విద్యార్థుల్లోని ప్రతిభ వెలికితీతకు చెకుముకి సైన్స్ సంబురాల నిర్వహణ’
NHM Employees | 30వ రోజు ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె.. చిన్నారులకు అందని టీకాలు
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : గుత్తా మంజుల
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

