NHM Employees | 30వ రోజు ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె.. చిన్నారులకు అందని టీకాలు
NHM Employees | గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల పాత్ర కీలకమని, వారి సమ్మెతో వైద్య సేవలపై ప్రభావం పడుతోందని పేర్కొంటున్నారు.
NHM Employees | మహాదేవపూర్ ( భూపాలపల్లి), నవంబర్ 11 : జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో ఎన్హెచ్ఎం (NHM) ఉద్యోగుల నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరడంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా చిన్నారులకు ప్రభుత్వం అందించే ఉచిత టీకాల కార్యక్రమం ప్రభావితమవుతోంది. నిర్ణీత సమయంలో వేయాల్సిన టీకాలు సైతం ఆలస్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
టీకాల కోసం ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లకు వెళ్తున్న తల్లిదండ్రులకు సిబ్బంది అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిన్నారులకు సమయానికి టీకాలు అందకపోవడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల పాత్ర కీలకమని, వారి సమ్మెతో వైద్య సేవలపై ప్రభావం పడుతోందని పేర్కొంటున్నారు.
ఈ సందర్భంగా ఎన్హెచ్ఎం జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించి సమ్మెను ముగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నారుల టీకాల కార్యక్రమం యథావిధిగా కొనసాగేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు బడితల రమేష్, ప్రధాన కార్యదర్శి మధు, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రఘురాం, సలహాదారులు శ్రీనివాస్, ప్రభాకర్, జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్, డాక్టర్ జగదీష్, మీడియా ఇన్చార్జి రాజు, డాక్టర్ విజయ్, డాక్టర్ బాలకృష్ణ, కృష్ణవేణి, పార్వతి తదితరులతో పాటు ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ఫార్మసీ అధికారులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Also :
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | 30వ రోజు ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె.. చిన్నారులకు అందని టీకాలు
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : గుత్తా మంజుల
రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
Jharkhand Workers Captive In Bihar | ఉపాధి కోసం వెళ్లిన జార్ఖండ్ కార్మికులు బీహార్‌లో బందీ.. సీఎం జోక్యం
Gautham Ghattamaneni | ‘రామాయణ’ సినిమాకు రివ్యూ ఇచ్చిన గౌతమ్ ఘట్టమనేని.. రేటింగ్ ఎంతంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

