‘విద్యార్థుల్లోని ప్రతిభ వెలికితీతకు చెకుముకి సైన్స్ సంబురాల నిర్వహణ’
విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని, ప్రశ్నించే తత్వాన్ని, సృజనాత్మకతను పెంపొందించేందుకు చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు ములకలపల్లి ఎంఈఓ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ములకలపల్లి మండలంలో చెకుముకి సైన్స్ సంబరాలు..
– ములకపల్లి ఎంఈఓ సత్యనారాయణ
ములకలపల్లి, నవంబర్ 11 : విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని, ప్రశ్నించే తత్వాన్ని, సృజనాత్మకతను పెంపొందించేందుకు చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు ములకలపల్లి ఎంఈఓ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ములకలపల్లి మండలంలో చెకుముకి సైన్స్ సంబరాలు–2026 పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్రీయ ప్రతిభను వెలికితీయడంతో పాటు, విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. విద్యార్థులు మూఢ నమ్మకాలకు దూరంగా ఉంటూ, ప్రతి విషయాన్ని శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ నెల 12న పాఠశాల స్థాయి పోటీలు, 21న మండల స్థాయి పోటీలు, 28న జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ వెంకన్న, హరిలాల్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యార్థుల్లోని ప్రతిభ వెలికితీతకు చెకుముకి సైన్స్ సంబురాల నిర్వహణ’
NHM Employees | 30వ రోజు ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె.. చిన్నారులకు అందని టీకాలు
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : గుత్తా మంజుల
రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
Jharkhand Workers Captive In Bihar | ఉపాధి కోసం వెళ్లిన జార్ఖండ్ కార్మికులు బీహార్‌లో బందీ.. సీఎం జోక్యం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

