Supreme Court | సుప్రీంకోర్టులో మల్టీ ఫెసిలిటీ సెంటర్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సహా పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణంతో ప్రజలకు సులభంగా న్యాయం జరుగుతుందన్నారు. మల్టీ పర్పస్ సెంటర్ ‘యాక్సెస్ టూ జస్టిస్ ఫర్ ఆల్’ క్యాంపెయిన్లో భాగమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆవరణలోని యూకో బ్యాంక్ ఎదురుగా ఉన్న సీ-ఇన్ గేటు సమీపంలో ఈ భవనాన్ని నిర్మించారు.
ఫెసిలిటీ సెంటర్ నిర్మాణం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటంటే.. ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులందరూ ఒకే చోట కేసులు నమోదు చేయడానికి, కేసులకు సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు వీలుగా నిర్మించారు. దాంతో సేవల్లో నాణ్యత పెరుగనున్నది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సీజేఐపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఎప్పుడూ హడావుడిగా ఉంటారని తాను చెప్పగలనని.. ఆయన దేశంలోని న్యాయవాదులకు, కక్షిదారులకు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. ఆయన వేగం, భవిష్యత్ గురించి ఆలోచనలను చూసి తాము ఆశ్చర్యపోయామని.. ఈ దేశ న్యాయ వ్యవస్థపై ఆయనకున్న నిబద్ధతకు ఈ ఫెసిలిటీ సెంటర్ ఓ ఉదాహారణ అని పేర్కొన్నారు.
#WATCH | Delhi | Chief Justice of India DY Chandrachud inaugurates the newly created ‘Multi-Facilitation Centre’, opposite UCO Bank, Near C-IN Gate, main campus, Supreme Court pic.twitter.com/G1iQbC4VAl
— ANI (@ANI) July 11, 2024