న్యూఢిల్లీ: హర్యానాలో జరిగిన కాంగ్రెస్ సభలో సాక్షాత్తూ ఆ పార్టీకి చెందిన ఒక మహిళా నేత పట్ల మరొక నాయకుడు అనుచితంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. హర్యానా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన ఒక సభలో కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హూడా, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. స్టేజిపై ఉన్న ఓ మహిళా నేతపై తోటి కాంగ్రెస్ నేత చేతులు వేస్తూ అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనను కాంగ్రెస్ నేత కుమారి సెల్జా కూడా నిర్ధారించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. కాంగ్రెస్ నేతల వైఖరిని పలువురు తప్పుబడుతున్నారు. బహిరంగంగా ఒక మహిళను అవమానించడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది.