Delhi Airport | ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే దేశ రాజధాని డిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Delhi Airport) భారీ భద్రతా వైఫల్యం (Major Security Breach) చోటు చేసుకుంది. శనివారం రాత్రి ఓ ఆగంతకుడు ఎయిర్పోర్ట్ గోడ దూకి రన్‌వేపైకి (Airport Runway) ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది. అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
గణతంత్ర దినోత్సవం తర్వాతి రోజు ఈనెల 27న రాత్రి 11:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన పైలట్ విమానాన్ని పార్క్ చేస్తుండగా ఆ వ్యక్తిని గుర్తించి వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించాడు. దీంతో సీఐఎస్ఎఫ్ (CISF) బలగాలు వెంటనే అక్కడికి చేరుకొని సదరు వ్యక్తిని అదులోకి తీసుకున్నారు. అతడు హర్యానా రాష్ట్రం నూహ్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనంతరం ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. మరోవైపు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF).. ఘటనపై విచారణ చేపట్టి ఆరోజు విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ను సస్సెండ్ చేసింది.
Also Read..
CM Hemant Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసానికి ఈడీ అధికారులు
Filmfare Awards | అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుక.. ఉత్తమ నటీనటులుగా అలియా-రణ్‌బీర్ జంట
ISSF World Cup | షూటర్ దివ్యాన్ష్‌కు స్వర్ణం.. వెండితో మెరిసిన సోనమ్