Filmfare Awards | అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుక.. ఉత్తమ నటీనటులుగా అలియా-రణ్‌బీర్ జంట
Filmfare Awards | బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2024 (Filmfare Awards 2024) జాబితా విడుదలైంది.
Filmfare Awards | బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2024 (Filmfare Awards 2024) జాబితా విడుదలైంది. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ( 68th edition of Filmfare Awards) వేడుక ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. గుజరాత్‌లోని గాంధీ నగర్లో జరిగిన ఈ వేడుకలో అవార్డ్స్ జాబితాను ప్రకటించారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి విజేతలను ప్రకటించారు.
ఈ జాబితాలో ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించిన 12th ఫెయిల్ (12th Fail ) ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఎలాంటి అంచనాలూ లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఈ చిత్ర దర్శకుడు విధు వినోద్ చోప్రా బెస్ట్ డైరెక్టర్ అవార్డున సొంతం చేసుకున్నాడు. ఇక బాలీవుడ్ స్టార్స్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), అలియాభట్ (Alia Bhatt) జంట ఉత్తమ నటుడు, నటి అవార్డులు గెలుచుకోవడం విశేషం. యానిమల్ చిత్రానికి గానూ రణ్‌బీర్ కపూర్‌కు ఉత్తమ నటుడు అవార్డు వరించింది. రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ చిత్రానికి గానూ అలియాభట్ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఉత్తమ సహాయ నటుడిగా విక్కీ కౌశల్ (డంకీ), ఉత్తమ సహాయ నటిగా షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ) ఎంపికయ్యారు.
అవార్డుల జాబితా..
- ఉత్తమ చిత్రం : 12th ఫెయిల్
- ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) : జొరామ్
- ఉత్తమ నటుడు : రణ్‌బీర్ కపూర్ (యానిమల్)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : విక్రాంత్ మెస్సె (12th ఫెయిల్)
- ఉత్తమ నటి : అలియాభట్ (రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ)
- ఉత్తమ నటి (క్రిటిక్స్) : రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్ అజ్)
- ఉత్తమ సహాయ నటుడు : విక్కీ కౌశల్ (డంకీ)
- ఉత్తమ సహాయ నటి : షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ)
- ఉత్తమ గీత రచయిత : అమితాబ్ భట్టాచార్య (తెరె వాస్తే.. : జరా హత్కే జరా బచ్చే)
- ఉత్తమ మ్యూజిక్ ఆల్బం : యానిమల్
- ఉత్తమ నేపథ్య గాయకుడు : భూపిందర్ బాబర్ (అర్జన్ వెయిలీ – యానిమల్)
- ఉత్తమ నేపథ్య గాయకురాలు : శిల్పా రావు (చెలెయ్ – జవాన్)
- ఉత్తమ కథ : అమిత్ రాయ్ (OMG 2)
- ఉత్తమ స్క్రీన్‌ప్లే : విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
- ఉత్తమ డైలాగ్ : ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ)
- బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ : హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్)
- బెస్ట్ సినిమాటోగ్రఫీ : అవినాష్ అరుణ్ దావరే ( త్రీ ఆఫ్ అజ్)
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : సుబ్రతా చక్రవర్తి, అమిత్ రే (సామ్ బహదూర్)
- బెస్ట్ ఎడిటింగ్ : జస్కున్వర్ సింగ్ కోహ్లీ- విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
- బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: సచిన్ లవ్లేకర్, దివ్యా గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)
- బెస్ట్ సౌండ్ డిజైన్: కునాల్ శర్మ (Mpse) (సామ్ బహదూర్), సింక్ సినిమా (యానిమల్)
- బెస్ట్ కొరియోగ్రఫీ: గణేష్ ఆచార్య (వాట్ జుమ్కా?- రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ)
- బెస్ట్ యాక్షన్ : స్పిరో రజాటోస్, అన్ల్ అరసు, క్రెయిగ్ మాక్రే, యాన్నిక్ బెన్, కెచా
- ఖంఫక్డీ, సునీల్ రోడ్రిగ్స్ (జవాన్)
- బెస్ట్ వీఎఫ్ఎక్స్ : రెడ్ చిల్లీస్ Vfx (జవాన్)
- బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్: తరుణ్ దూదేజా (ధక్ ధక్)
- బెస్ట్ డెబ్యూ మేల్ : ఆదిత్య రావల్ (ఫరాజ్)
- బెస్ట్ డెబ్యూ ఫీమేల్: అలిజే అగ్నిహోత్రి (ఫారీ)
- లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు: డేవిడ్ ధావన్
Also Read..
Rahul Gandhi | నేడు బీహార్‌లోకి ప్రవేశించనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర
EV Battery | 5 నిమిషాల్లోనే చార్జ్ అయ్యే ఈవీ బ్యాటరీ.. కార్నెల్ పరిశోధకుల బృందం అభివృద్ధి
Moon | కుంచించుకుపోతున్న చంద్రుడు..! ప్రకంపనాల వల్ల ఉపరితలం గుంతలమయం..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

