Haryana | హర్యానా (Haryana) అదనపు డీజీపీ వై పూరన్ కుమార్ (Y Puran Kumar) ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పూరన్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ తాజాగా మరో పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. పూరన్‌పై అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఏఎస్సై సందీప్ కుమార్ గన్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆయన సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు.
రోహ్తక్ (Rohtak) సైబర్ సెల్లో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్గా నియమితులైన సందీప్.. పూరన్ కుమార్ అవినీతి కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఆయన ఇవాళ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అందులో పూరన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పూరన్ ఓ అవినీతి అధికారి అంటూ ఆరోపించారు. అవినీతి కేసులో శిక్ష పడుతుందన్న భయంతోనే పూరన్ ఆత్మహత్య చేసుకున్నట్లు సందీప్ కుమార్ వెల్లడించారు. ‘పూరన్ కుమార్ ఓ అవినీతి అధికారి. అతని అవినీతి మామూలుగా లేదు. అదంతా బయటపడుతుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు’ అని పేర్కొన్నారు. సత్యం కోసం తన ప్రాణాలను త్యాగం చేస్తున్నట్లు ఈ సందర్భంగా సెల్ఫీ వీడియోలో సందీప్ కుమార్ పేర్కొన్నారు.
Also Read..
Senior Haryana cop | హర్యానా డీజీపీ ఆత్మహత్య.. ఎస్పీపై వేటు
పోలీస్ అధికారి పూరన్ ఆత్మహత్యపై సిట్