CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎంకు నాలుగోసారి ఈడీ నోటీసులు
CM Arvind Kejriwal : సీఎం కేజ్రీవాల్‌కు నాలుగోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. లిక్కర్ కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎంకు మూడు సార్లు నోటీసులు వెళ్లాయి. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. జనవరి 18వ తేదీన హాజరుకావాలని తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాలుగోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 18వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నది. జనవరి 3వ తేదీన విచారణకు రావాలని ఈడీ ఇచ్చిన నోటీసులను కేజ్రీ తిర్కరించారు. ఆ నోటీసులు అక్రమంగా ఉన్నాయని, కేవలం తనను అరెస్టు చేసేందుకు నోటీసులు ఇచ్చినట్లు కేజ్రీ పేర్కొన్నారు. గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21వ తేదీన హాజరుకావాలని ఆదేశించారు. కానీ మూడుసార్లూ ఆయన ఈడీ నోటీసుల్ని పట్టించుకోలేదు.
మద్యం విధానం కేసులో ఇప్పటికే సీబీఐ ఆయన్ను గత ఏడాది ఏప్రిల్‌లో విచారించింది. కానీ సీబీఐ మాత్రం ఆప్ నేతను నిందితుడిగా పేర్కొనలేదు. అయితే తొలిసారి ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత.. కేజ్రీని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ అరెస్టు అయ్యారు. ఒకవేళ కేజ్రీ అరెస్టు అయినా.. ఆయన జైలు నుంచే బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

