న్యూఢిల్లీ : స్కూల్ ఫంక్షన్లో ఫ్రెండ్ డ్యాన్స్ చేస్తుండగా చీర్లీడర్గా మారిన విద్యార్ధి వేదికపైకి వచ్చి అతడిపై కరెన్సీ నోట్లు వెదజల్లాడు. అత్యుత్సాహంతో విద్యార్ధి చేసిన పని బూమరాంగ్ అయింది. ఫ్రెండ్పై కరెన్సీ నోట్లు చల్లిన విద్యార్ధిని ఓ టీచర్ కొట్టుకుంటూ బయటకు తీసుకువెళుతున్న వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
बड़ा चौधरी बन रहा था 😅 pic.twitter.com/ZhimFQDEvi
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 2, 2022
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైరల్ వీడియోను ఇప్పటివరకూ 6 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. టీచర్ ఈ రకంగా ప్రవర్తించి ఉండకూడదని పలువురు నెటిజన్లు స్పందించగా విద్యార్ధి క్రమశిక్షణ తప్పినందున టీచర్ సరైన పనే చేశాడని మరికొందరు రాసుకొచ్చారు.