న్యూఢిల్లీ : దేశాన్ని ఊపేసిన కాలా చష్మా సాంగ్‌కు బాలీవుడ్ స్టార్ సిద్ధార్ధ్ మల్హోత్రాతో కలిసి సద్గురు ఆడిపాడారు. సేవ్ సాయిల్ క్యాంపెయిన్ వేదికగా సిద్ధార్ధ్ మల్హోత్రాతో కలిసి సద్గురు సందడి చేశారు. మార్చి 2022లో సేవ్ సాయిల్ నినాదంతో సద్గురు తన బీఎండబ్ల్యూ కే1600 జీటీ స్పోర్ట్స్ బైక్‌పై 30,000 కిలోమీటర్లు తిరగాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్యాంపెయిన్‌లో సద్గురుతో బాలీవుడ్ నటుడు సిద్ధార్ధ్ మల్హోత్రా తోడవడంతో ఇద్దరూ సమున్నత లక్ష్యం కోసం బైక్స్‌పై దూసుకెళ్లారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా సినీ, ఆధ్యాత్మిక, సామాజింకాశాలపై వారిద్దరూ మాట్లాడుకున్నారు.
కాలా చష్మా సాంగ్‌ను వీరు రీక్రియేట్ చేసిన వీడియోను సిద్ధార్ధ్ మల్హోత్రా షేర్ చేశారు. మెరుగైన రేపటి కోసం సద్గురుతో కలిసి సాగుతూ అంటూ సిద్ధార్ధ్ రాసుకొచ్చారు. ఇక కాలా చష్మా సాంగ్‌కు సిద్ధార్ధ్ మల్హోత్రా హుషారుగా డ్యాన్స్ చేయగా సద్గురు అతడితో జత కలిశారు.