న్యూఢిల్లీ : పులి ఎదురుపడితే ఎలాంటి జంతువైనా భయంతో వణికిపోతుంది. అడవిలో పులి ఎదుట పడేందుకు జంతువులు సాహసించవు. ఇక ఏనుగుల గుంపునకు దారి ఇచ్చేందుకు పులి పొడవైన గడ్డి మాటున నక్కిన వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్లో షేర్ చేశారు.
ఈ క్లిప్‌ను తొలుత విజేత సింహ రికార్డు చేశారు. అడవిలో స్వేచ్ఛగా విహరించే పులి ఏనుగుల గుంపు వెళ్లేందుకు తాను గడ్డిలో దాక్కునిఉండటం ఈ వీడియోలో చూడొచ్చు. జంతువుల మధ్య ఉండే సామరస్య గుణాన్ని వెల్లడించే ఈ క్లిప్ నెట్టింట పలువురిని ఆకట్టుకుంటోంది.
This is how animals communicate & maintain harmony…
Elephant trumpets on smelling the tiger. The king gives way to the titan herd😌😌
Courtesy: Vijetha Simha pic.twitter.com/PvOcKLbIud— Susanta Nanda (@susantananda3) April 30, 2023
జంతువులు ఈ రకంగా కమ్యూనికేట్ చేసుకుంటూ సామరస్యంగా మెలుగుతాయి. పులి వాసనను పసి గట్టిన ఏనుగు శబ్ధం చేస్తే అడవికి రాజు ఆపై గజరాజుకి దారి ఇచ్చాడని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌కు ఇప్పటివరకూ 87,000 వ్యూస్ రాగా, పులి సమయస్ఫూర్తిని పలువురు ప్రశంసించారు. పెద్ద జంతువును ఎదుర్కోవడం అసాధ్యమని గ్రహించిన పులి తెలివిగా దూరం పాటించిందని యూజర్లు కామెంట్ చేశారు.