Australia Terror Attack | టెర్రరిస్ట్ సాజిద్‌కు హైదరాబాద్ లింక్స్.. ఆస్ట్రేలియా ఉగ్రదాడిలో కీలక విషయాలు వెలుగులోకి..!
Australia Terror Attack | ఆస్ట్రేలియాలోని బౌండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నట్లుగా ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు.
Australia Terror Attack | ఆస్ట్రేలియాలోని బౌండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నట్లుగా ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. అతని దగ్గర హైదరాబాద్ పాస్‌పోర్టు లభ్యమైంది. ఈ నేపథ్యంలో సాజిద్ అక్రమ్ గురించి కీలక విషయాలను తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు.
సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లోనే బీకామ్ పూర్తి చేశాడని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. స్టూడెంట్ వీసాపై 1998 నవంబర్‌లో ఆస్ట్రేలియాకు వెళ్లాడని పేర్కొన్నారు. అక్కడే యూరప్‌లోని ఇటలీకి చెందిన వెనీరా గ్రాసోను వివాహం చేసుకున్నాడని పేర్కొన్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారని చెప్పారు. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత 2001లో తన వీసాను పార్టనర్ వీసాగా మార్చుకున్నాడు.. 2002లో రెసిడెంట్ వీసాను పొందినట్లు తెలిసింది. ఇప్పటికీ సాజిద్ ఇండియన్ పాస్‌పోర్టు కలిగి ఉన్నాడని.. అతని పిల్లలు మాత్రం ఆస్ట్రేలియా పౌరసత్వం ఉందని చెప్పారు.
గడిచిన 25 ఏళ్లలో సాజిద్ ఆరుసార్లు మాత్రమే ఇండియాకు వచ్చాడని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 2017లో తండ్రి చనిపోయిన సమయంలో ఒకసారి హైదరాబాద్ వచ్చి వెళ్లాడని పేర్కొన్నారు. 2022లో హైదరాబాద్‌లోని టోలీచౌకీలో ఉన్న ఆస్తులను అమ్ముకొని వెళ్లినట్లు చెప్పారు. తెలంగాణలో సాజిద్‌పై ఎలాంటి క్రైమ్ రికార్డ్స్ లేవని వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

