Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాతావరణ కాలుష్యం కొనసాగుతున్నది. కాలుష్యానికి తోడు విపరీతంగా పొగమంచు కమ్మేసింది. దాంతో జనం ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కాలుష్యంతో కారణంగా పలువురు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 అమలులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా మంగళవారం మాట్లాడుతూ తొమ్మిది నుంచి పది నెల్లో కాలుష్యాన్ని పూర్తిగా నిర్మూలించడం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమని పని అంగీకరించారు. ఈ విషయంలో ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే రోజువారీ గాలి నాణ్యత సూచీ తగ్గించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తామని హామీ హామీ ఇచ్చారు. డిసెంబర్ 18 నుంచి రాజధానిలో పీయూసీ సర్టిఫికెట్ లేకుండా ఏ వాహనానికి కూడా పెట్రోల్, డీజిల్ పోయరని ఆయన స్పష్టం చేశారు. వాహన డ్రైవర్లు తప్పనిసరిగా పీయూసీ చేయించుకోవడానికి రెండురోజుల సమయం మాత్రమే ఉందన్నారు. గురువారం నుంచి ఈ నిబంధనలను అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారన్నారు. సంబంధిత వాహనాన్ని సీజ్ చేసి, భారీ జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. దాంతో పాటు ఢిల్లీ వెలుపల నుంచి వచ్చే బీఎస్-6 ప్రమాణం కంటే తక్కువ ఉన్న వాహనాలపై తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు నిషేధం కొనసాగనున్నది.