న్యూఢిల్లీ : ఓ చిరుత రాత్రి వేళ వేటకు ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆవు వెనుక మాటు వేసిన చిరుత నెటిజన్లలో ఉత్కంఠ పెంచింది. విక్రాంత్ స్మైక్ అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. కారులో కూర్చున్న వ్యక్తి ఈ క్లిప్‌ను రికార్డు చేశారు. ఈ వీడియో ఆవు వెనుక చిరుత పులి మాటువేయడంతో ప్రారంభమవుతుంది.
కారు నుంచి హెడ్‌లైట్స్ వెలగడంతో ఆవు మీదుగా చిరుత పరుగుపెడుతుంది. ఆవుకు చిరుత ఎలాంటి హాని చేయకుండా వెళ్లడంతో నెటిజన్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. చిరుత ఆకలితో లేకపోవడం వల్లే ఆవును వదిలేసిఉంటుందని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. ఫ్లాష్ లైట్స్ వెలగడంతో చిరుత ఆవును దాటి ముందుకు ఉరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 16,000 మందికిపైగా వీక్షించారు.