అహ్మదాబాద్ : గుజరాత్‌లోని దేవ్‌భూమి ద్వారకా జిల్లా ఖంబలియా పట్టణంలోని స్ధానిక ఎగ్జిబిషన్లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. గణేష్ చతుర్ధి సందర్భంగా ఏర్పాటైన ఈ ఎగ్జిబిషన్లో హెయిర్‌ను వదులుగా ఉంచుకుని యువతి రైడ్‌కు వెళ్లింది. రెండు రొటేషన్స్ పూర్తయిన అనంతరం యువతి జుట్టు వీల్లో చిక్కుకుపోయింది.
యువతి కేకలు వేయడంతో రైడ్‌ను తక్షణం నిలిపివేసి ప్రజలను ఖాళీ చేయించారు. కొందరు ఆమెను కాపాడేందుకు చొరవ చూపిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఓ వ్యక్తి ఆమె తలను పట్టుకోగా మరొకరు ఆమె జుట్టును కత్తితో కత్తిరించడం ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఈ వైరల్ క్లిప్‌లో చూడొచ్చు. ఈ ఘటనను కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు.
Read More :