న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ వల్ల కొందరు విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల విద్యార్థులు ఆ టెన్షన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆ బాధిత కుటుంబీకులకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janta Party) డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే .. ఇవాళ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రవేశ పరీక్షల వివాదాల వల్ల ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని దీప్కే డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొన్నదని, దీని వల్ల ఆ విద్యార్థుల మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు దీప్కే తన లెటర్లో ఆరోపించారు.
మరో వైపు జూన్ 20వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ భారీ స్థాయిలో రెండో నిరసన ప్రదర్శనకు సిద్ధం అవుతున్నది. భారమైన హృదయంతో లేఖ రాస్తున్నానని, మన భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారిన ఈ అంశంపై మీరు తక్షణమే స్పందించాలని దీప్కే తన లేఖలో ప్రధానిని కోరారు. మన విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వేడుకున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా 11 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. రీ-ఎగ్జామ్‌పై అపనమ్మకం ఏర్పడడం వల్ల విద్యార్థుల్లో ఆందోళన ఎక్కువైందన్నారు. జీవితం మొత్తం కష్టపడి పిల్లలను చదవిస్తే, ఆ కుటుంబాలు ఇప్పుడు పిల్లల్ని కోల్పోతున్నాయని దీప్కే తన లెటర్లో ఆరోపించారరు.
పరీక్షల వత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారంగా కోటి ఇవ్వాలని దీప్కే డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని కోరారు. మరో వైపు జూన్ 21వ తేదీన నీట్-రీఎగ్జామ్‌ను నిర్వహించనున్న విషయం తెలిసిందే.
Ahead of a proposed student protest at #JantarMantar, #CJP founder #AbhijeetDipke wrote to Prime Minister #NarendraModi, urging the Centre to provide Rs 1 crore compensation to families of students who allegedly died by suicide amid examination-related controversies.… pic.twitter.com/OFbtmnZRGZ
— Cockroach Janta Party (@CJP_for_India) June 19, 2026