Impose President Rule | మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించండి.. సేన నేత హత్యపై ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్
Impose President Rule | మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని (Impose President Rule) శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఆయన వర్గం శివసేన నేత హత్య నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని (Impose President Rule) శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఆయన వర్గం శివసేన నేత హత్య నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల కిందట ముంబైలోని దహిసర్‌లో స్థానిక వ్యాపారవేత్త మారిస్ నోరోన్హా ఫేస్బుక్ లైవ్‌లో శివసేన (యూబీటీ) నేత అభిషేక్ ఘోసల్కర్‌పై కాల్పులు జరిపి హత్య చేశాడు. ఆ తర్వాత కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి ముందు ఫిబ్రవరి 2న ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ కాల్పులు జరిపాడు. ఏకంగా పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన జరుగడం కలకలం రేపింది.
కాగా, ఈ సంఘటనలపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. తమ పార్టీ నేత అభిషేక్‌ను కాల్చి చంపడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. షిండే ప్రభుత్వం గూండాలను కాపాడుతున్నదని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంతోపాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

