రాణిపేట్: ఇంజినీరింగ్, వైద్య విద్యను తమిళ భాషలో బోధించాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) కోరారు. హిందీ భాషను వ్యతిరేకిస్తూ స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్‌గా అమిత్ షా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్థానిక భాషల్లో పరీక్షలు రాసే వీలు కల్పించిందని, ఇప్పుడు సీఐఎస్ఎఫ్ పరీక్షను తమిళంలోను రాయవచ్చు అని మంత్రి పేర్కొన్నారు. తమిళనాడులోని రాణిపేట్‌లో జరిగిన 56వ సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే ఈవెంట్లో పాల్గొని ఆయన మాట్లాడారు.
తమిళ విద్యార్థుల లబ్ధి కోసం ఇంజినీరింగ్, మెడికల్ విద్యను తమిళంలో బోధించాలని సీఎం స్టాలిన్‌ను కోరుతున్నట్లు అమిత్ షా తెలిపారు. భారతీయ సంస్కృతిని బలోపేతం చేయడంలో తమిళనాడు కీలక పాత్ర పోషించిందన్నారు. పరిపాలనా సంస్కరణలైనా, ఆధ్మాత్మిక చింతనైనా, విద్య అయినా.. దేశ సమగ్రత, ఐక్యత అయినా తమిళనాడు పాత్రను విస్మరించలేమన్నారు.
#WATCH | Arakkonam, Tamil Nadu: Union Home Minister Amit Shah says, “… Till now, there was no place for mother tongue in the CAPF recruitment… PM Narendra Modi decided that our youth will now be able to write their CAPF exam in all languages in the eight list, including… pic.twitter.com/Q8pXv1IzZ4
— ANI (@ANI) March 7, 2025