monsoon rain | జూలైలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే.. ఐఎండీ అంచనా
monsoon rain : దేశంలో ఇప్పటికే వర్షపాతం లోటు కనిపిస్తోంది. జూన్లో తగినంతగా వర్షాలు కురవలేదు. జూలైలోనైనా భారీ వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్న వారికి షాకిచ్చే ప్రకటన చేసింది భారత వాతావరణ సంస్థ ఐఎండీ. జూలైలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని ప్రకటించింది.
monsoon rain : దేశంలో ఇప్పటికే వర్షపాతం లోటు కనిపిస్తోంది. జూన్లో తగినంతగా వర్షాలు కురవలేదు. జూలైలోనైనా భారీ వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్న వారికి షాకిచ్చే ప్రకటన చేసింది భారత వాతావరణ సంస్థ ఐఎండీ. జూలైలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని ప్రకటించింది. పసిఫిక్ భూమధ్య రేఖ వద్ద ఎల్నినో బలపడటం వల్ల ఈ పరిస్థితి ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే జూన్లో 39 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
1901 తర్వాత ఈ స్థాయిలో జూన్లో లోటు వర్షపాతం నమోదు కావడం ఇది ఐదోసారి. అంటే 125 ఏళ్లలో ఇంత తక్కువ వర్షపాతం నమోదైన ఐదు జూన్లలో ఇదీ ఒకటి. ఐఎండీ తాజా అంచనా ప్రకారం జూలైలో దేశంలోని అనేక ప్రాంతాల్లో తక్కువ వర్షపాతమే నమోదవుతుంది. సెంట్రల్ ఇండియా, ఉత్తర భారత, తూర్పు భారత్ ప్రాంతాల్లో లోటువర్షపాతమే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షపాతమే నమోదయ్యే ఛాన్స్ ఉంది. వాయువ్య, తూర్పు-మధ్య, తూర్పు ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. దేశంలో లోటు వర్షపాతం ఉండటంతో వ్యవసాయ రంగంలో అనిశ్చితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే ఖరీఫ్ సాగు 23 శాతం తగ్గినట్లు కేంద్రం అంచనా వేస్తోంది. వర్షాలు కురవకపోవడంతో వరి, పప్పుధాన్యాలు, సోయాబీన్, పత్తి వంటి పంటలు ఎక్కువగా నాట్లు వేయలేదు.
వర్షాకాలంలో నాలుగు నెలల్లో జూన్, జూలైలలో తక్కువ వర్షపాతమే నమోదవుతుంది. అయితే, ఆ తర్వాత నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఆగష్టు, సెప్టెంబర్లలో మెరుగైన వర్షపాతం నమోదు కావొచ్చని ఆస్ట్రేలియాకు చెందిన వాతావరణ సంస్థ బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ (బీఓఎం) తెలిపింది. కానీ, జూలైలో నమోదయ్యే వర్షపాతమే దేశంలో భారీ వర్షాలకు కారణమవుతుంది. వర్షాల లోటును తీరుస్తుంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నా.. సాధారణ వర్షపాతమే నమోదవుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళనాడు సీఎం విజయ్తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

