న్యూఢిల్లీ, నవంబర్ 4: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. 2021-22లో దాదాపు 19,883 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ పట్టుబడగా.. 2022-23లో 96,917 మందిని పట్టుబడ్డారు.
అంటే అక్రమంగా ప్రవేశిస్తున్న వారి సంఖ్య ఒక్క ఏడాదిలో దాదాపు ఐదు రెట్లు పెరిగింది. ఎక్కువ మంది కెనడా, మెక్సికో సరిహద్దుల గుండానే అమెరికాలోకి ప్రవేశించడానికి యత్నించారు.