చెన్నై, ఆగస్టు 6: ఐఐటీ మద్రాస్‌కు ఓ పూర్వ విద్యార్థి భూరి విరాళం అందజేశారు. 1970 ఎంటెక్ ఎయిరో స్పేస్ ఇంజినీరింగ్ బ్యాచ్‌కు చెందిన డాక్టర్ కృష్ణ చివుకుల రూ.228 కోట్ల విరాళం ప్రకటించారు. దేశ చరిత్రలో ఒక విద్యా సంస్థకు ఇంత పెద్ద మొత్తంలో విరాళం లభించడం ఇదే మొదటిసారి. కృష్ణ అందించిన విరాళానికి గుర్తింపుగా ఐఐటీలోని ఒక అకడమిక్ బ్లాక్‌కు ఆయన పేరు పెట్టారు. మంగళవారం జరిగిన ఈ నామకరణోత్సవానికి కృష్ణ చివుకుల, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు.