IIM Bangalore | ఇండోనేసియాలో ఐఐఎం బెంగళూరు క్యాంపస్.. విదేశాల్లో ఏర్పాటుకానున్న రెండో ఐఐఎం
IIM Bangalore : ఇండోనేసియాలో ఐఐఎం బెంగళూరు క్యాంపస్ ఏర్పాటుకానుంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం మోదీ ఇండోనేసియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇండోనేసియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటోతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
IIM Bangalore : ఇండోనేసియాలో ఐఐఎం బెంగళూరు క్యాంపస్ ఏర్పాటుకానుంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం మోదీ ఇండోనేసియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇండోనేసియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటోతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్మీట్లో మోదీ మాట్లాడుతూ ‘‘ఇరు దేశాల మధ్య ఏఐ, టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ వంటి టెక్నాలజీలో యువతకు సహకారానికి ఈ రోజు ఇండోనేసియా, ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది.
రెండు దేశాల మధ్య స్టార్టప్‌ల సహకారాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. ఇండియాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ ఐఐఎం బెంగళూరు క్యాంపస్‌ను ఇండియాలో ప్రారంభించబోతున్నాం’’ అని అన్నారు. ఐఐఎంలకు సంబంధించి విదేశాల్లో ప్రారంభించబోతున్న రెండో క్యాంపస్ ఇది. గతంలో ఐఐఎం అహ్మదాబాద్ క్యాంపస్‌ను దుబాయ్‌లో ఏర్పాటు చేశారు. ఐఐఎంలతోపాటు ఐఐటీ క్యాంపస్‌లు కూడా కొన్ని విదేశాల్లో ఉన్నాయి. ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లు టాంజానియాలోని జాంజిబర్లో ఉండగా, ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ అబుదాబిలో 2024లో ప్రారంభమైంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ప్రకారం.. ఐఐఎంలలో ఐఐఎం అహ్మదాబాద్ మొదటి స్థానంలో ఉండగా, ఐఐఎం బెంగళూరు రెండో స్థానంలో ఉంది.
క్యాట్ స్కోర్ ఆధారంగా ఐఐఎంలలో ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. సాధారణంగా క్యాట్ పరీక్ష నవంబర్ చివరి వారంలో జరుగుతుంది. క్యాట్ నోటిఫికేషన్ జూలైలో విడుదలై, ఆగష్టులో ముగుస్తుంది. బ్యాచిలర్ డిగ్రీ పొంది, కనీసం 50 శాతం మార్కులున్న వారు ఐఐఎంలలో ప్రవేశానికి అర్హులు. రిజర్వేషన్ కేటగిరీల వారికి 45 శాతం మార్కులు వస్తే చాలు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ విభాగాలకు చెందిన విద్యార్థులకు ఫీజు రూ.1,300 కాగా, ఇతరులకు రూ.2,600.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

