న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో అరెస్టయ్యి జైలులో ఉన్న నేతలు వర్చువల్గా ఎన్నికల ప్రచారం చేయడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇలా అనుమతిస్తే భయంకరమైన నేరస్తులు, దావూద్ ఇబ్రహీం సైతం రాజకీయ పార్టీలలో తమ పేర్లను నమోదు చేసుకుని ప్రచారం చేస్తారంటూ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయపరమైన ఉత్తర్వుల కారణంగా జైలులో ఉంటే అలాంటి వారికి మాత్రమే వర్చువల్ ప్రచారానికి కోర్టు అనుమతిస్తుందన్నారు. ఇది చట్టం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని తెలిపింది.